తాడిపత్రి: అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గానిది ఓ ప్రత్యేకత. అక్కడ గతంలో కనిపించిన పెత్తందారీ పోకడలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి, సామాజిక సాధికారయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బహిరంగసభను విజయవంతం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీచరణ్, ఎంపీలు నందిగం సురేష్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.... – జనం సముద్రకెరటాల్లా పోటెత్తడం చూస్తుంటే..జగనాభిమానానికి ఆకాశమే హద్దులా అనిపిస్తోంది. –నేను విన్నాను, నేను చూసాను, నేను చేస్తాను అని నాడు పాదయాత్ర సందర్భంగా చూసిన పేద, అణగారిన వర్గాల కష్టాలు, కన్నీళ్లు తుడిచే దిశలోనే ..ఈ నాలుగున్నరేళ్ల పాలనను నడిపించారు జగనన్న. – బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను చట్టసభలకు పంపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. – జగనన్న ముందు ఎందుకు పనికిరాని నాయకుడు చంద్రబాబు. అణగారిన వర్గాలను మరింతగా అణిచిపెట్టాలని చూసిన దుర్మార్గుడు చంద్రబాబు. –అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని, వారి స్థాయిని పెంచాలని చూస్తున్న మనసున్న మనిషి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. –పేదవాడి పిల్లాడు పేదవాడిగానే ఉండకూడదు. కార్మికుడి కొడుకు కార్మికుడిగానే ఉండిపోకూడదు. తక్కువ వృత్తుల్లో ఛిద్రమైన తండ్రుల్లానే వారి పిల్లలు కాకూడదు అన్న ఆలోచనతో... ఒక మామలా చదివిస్తున్నాడు జగనన్న. –విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో పేద పిల్లలకు ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి వచ్చాయి. – కార్పొరేట్ స్కూళ్లతో సర్కారు బళ్లు పోటీపడేలా తయారయ్యాయి. పేదింట పిల్లలు.. దర్జాగా స్కూళ్లకు వెళ్లే పరిస్థితులొచ్చాయి. –బాబు హయాంలో విద్యారంగంలో పదిహేనో స్థానంలో ఉన్న మనం...ఇప్పుడు మూడోస్థానంలో ఉన్నాం. ఇది బాబు పాలనకు, జగనన్న పాలనకు తేడా! –నా బిడ్డ, నా తమ్ముడు, నా మనవడు, నా అన్నయ్య..ఇలా ప్రతివారు జగనన్నను తమ ఆత్మీయుల్లో ఒకరిగా చూసుకుంటున్నారంటే... దేశంలోనే మరే నాయకుడికి ఇంత అదృష్టం పట్టలేదనిపిస్తుంది. మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.... –ఈరోజు సామాజిక సాధికార యాత్రకు తండోపతండాలుగా తరలివచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలను చూస్తుంటే, వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. – గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అవమానించి,అవహేళనలు చేసి, చులకనగా చూసిన చంద్రబాబు రాజకీయం మనకు తెలుసు. –అదే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను అక్కున చేర్చుకుని, తన వారిగా స్వంతం చేసుకుని, వారి సంక్షేమం కోసం, వారి స్థాయి పెంచడం కోసం జగనన్న ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. –అణచివేతకు గురై, పేదరికంతో అల్లాడిపోతున్న ప్రజలపై అపార ప్రేమను చూపుతూ, సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, –అలాగే అణగారిన వర్గాలకు చెందిన ప్రతి వెనుకబడిన కులాన్ని చేయిపట్టుకుని, ముందుకు నడిపిస్తున్న జగనన్న సామాజిక న్యాయానికి ప్రతీక. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..... –ఇంత పెద్ద ఎత్తున సామాజిక సాధికార బహిరంగసభ జరుగుతుంటే ...చాలా గర్వంగా అనిపిస్తోంది. –ఈ నాలుగున్నరేళ్లలో మన ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. –మహిళలకు అన్నింటా పెద్దపీట వేశారు. –ఇక బడుగు, బలహీనవర్గాల పిల్లలు దర్జాగా బళ్లకు వెళుతున్నారంటే, ఆయా వర్గాల పేదలు ఈరోజు సంతోషంగా ఉన్నారన్నా, ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తున్నారన్నా అందుకు కారణం సీఎం జగన్. –సుపరిపాలనకు సరైన అర్థం చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. –చంద్రబాబువన్నీ కుట్రపూరిత రాజకీయాలు. ఆయన హయాంలో పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు. –గతంలో 600 పైగా హామీలిచ్చి, ఒక్కటీ నెరవేర్చని చరిత్ర చంద్రబాబుది. జనాల్ని ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి చంద్రబాబు. –అందుకు భిన్నంగా, పేదల, బడుగు,బలహీన వర్గాల ప్రభుత్వంగా, తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు జగనన్న. –ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. దాదాపు 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత జగనన్నది. –సామాజిక న్యాయంలో సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. –మన రాష్ట్రం బాగుండాలంటే...జగనన్న కావాలి. –విద్యా, వైద్యరంగాలు బాగుండాలంటే...జగనన్న కావాలి. –వ్యవసాయం బాగుండాలన్నా..రైతన్నలు బాగుండాలన్నా, జగనన్న కావాలి. –పేదల రెక్కల డొక్కల ఆకలి చప్పుళ్లు తెలిసిన నాయకుడు జగనన్నే. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ... –ఇచ్చిన మాట ప్రకారమే సీట్లలోను, పదవుల్లోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం ఇచ్చారు. అది కదా...మాటిస్తే తప్పని నైజం. –రాయలసీమ జిల్లాల్లో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలుంటే, అందులో ఐదు బీసీ, ఎస్సీలకే ఇచ్చారు జగనన్న. – ఏమాత్రం రాజకీయ, ఆర్థిక బలం లేని మాలాంటి వాళ్లం ఎంపీలం, ఎమ్మెల్యేలం అయ్యామంటే అది జగనన్న చలవే. సామాజిక న్యాయమంటే జగనన్న. –పుస్తకాల్లో మాత్రమే ఉన్న సామాజిక సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. –అలాంటి మంచి నాయకుడి వెంట మనం ఉండటం ఎంతో అవసరం. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ... –గతంలో పాలకులెవరూ ఎప్పుడూ సామాజిక న్యాయం అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. –జగనన్న హయాంలోనే సామాజిక న్యాయమన్నది చూస్తున్నాం. –మన అనంతపురం జిల్లావరకు చూసుకున్నా, ఇక్కడ బీసీ మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్, మేయర్‌లున్నారు. కార్పొరేషన్లలోనూ బడుగు, బలహీనవర్గాలకే పెద్దపీట వేశారు జగనన్న. –ఈ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం చూస్తే అసహ్యమేస్తుంది. పేదలకు, అణగారిన వర్గాలకు చేసే ప్రతి మంచి పనికీ అడ్డుపడుతోంది. –ఆ టీడీపీ నాయకులెవరో మీకు తెలుసు. టీడీపీ పైస్థాయిలో ఎలా దోచుకో...దాచుకో సిద్ధాంతాన్ని అనుసరిస్తోందో..అదే తరహాలో ఇక్కడ పచ్చ సోదరులు పనిచేస్తున్నారు. తాడిపత్రిలో వారి అరాచకాలకు అంతులేదు. –జగనన్న ఆదర్శాలు, ఆలోచనలకనుగుణంగా నేను ముందుకు సాగుతున్నాను. – బడుగు, బలహీనవర్గాలకు అండాదండగా ఉండటం మన పార్టీ సిద్ధాంతం. – సామాజిక న్యాయం మన పార్టీ శ్వాస. సామాజిక సాధికారతే మన పార్టీ ధ్యాస. జగనన్న బాటలోనే మనమంతా. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.... –మేమంతా జగనన్న తయారుచేసిన నాయకులం...జగనన్న సైనికులం. –రాష్ట్రంలో నివాసం లేనివారు ఇక్కడొచ్చి పాలిస్తామంటే మనమంతా అంగీకరించాలా? –మనకోసం జగనన్న ఇక్కడే ఉంటూ, నిరంతరం మన మేలుకోసం పనిచేస్తున్నాడు. –పేదల కష్టాలు తెలిసినవాడు, బడుగు,బలహీనవర్గాల సమస్యలు తెలిసినవాడు. పేదలకు కష్టాలు లేకుండా చేయడంలో, బడుగు,బలహీనవర్గాల సమస్యలు తీర్చడంలో జగనన్న తర్వాతే ఎవరైనా. –అటు విద్యారంగంలో, ఇటు వైద్యరంగంలో కలలో కూడా ఊహించలేని, గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిన నాయకుడు జగనన్న. –అణగారిన వర్గాలకు, పేదలకు నేనున్నానని భరోసానిస్తున్న నాయకుడు జగనన్న. సంక్షేమ పథకాలతో ఆర్థిక స్వావలంబన దిశలో మనల్ని నడిపిస్తున్న నాయకుడు జగనన్న.