జగనన్న అంటే ఓ సామాజిక విప్లవం

ప్రజా పాలన జగనన్నకే సాధ్యమైంది: మంత్రి మేరుగ నాగార్జున

అణగారిన వర్గాల్లో వెలుగులు నిండాలంటే జగనన్నే మళ్లీ రావాలి: మంత్రి గుమ్మనూరు జయరామ్‌

జగనన్న అంటే ఓ సామాజిక విప్లవం: ఎంపీ గోరంట్ల మాధవ్‌

పేదల బాగు కోరే నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్: ఎంపీ నందిగం సురేష్‌

అణగారిన వర్గాల శ్రేయోభిలాషి మన ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి 

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర 

రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విశేషంగా జనం తరలివచ్చారు. బైక్‌ ర్యాలీ తర్వాత, జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. జై జగన్‌ నినాదాలతో సభాస్థలిని హోరెత్తించారు. నాయకుల ఉపన్యాసాలను జనం శ్రద్దగా విన్నారు. నాలుగున్నరేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జరిగిన మేలును నాయకులు మరోసారి గుర్తుచేశారు.  బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరామ్, ఎంపీలు నందిగం సురేష్, గోరంట్ల మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ...

– అంబేద్కర్, జ్యోతిరావ్‌ పూలే ఆదర్శాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక సాధికారత అందించిన జగనన్న.
– మహానుభావులు ఉద్యమాలు చేసి, సాధించాలనుకున్న సామాజిక న్యాయాన్ని ఆచరణలోకి తెచ్చిన జగనన్న.
– అణగారిన వర్గాలకు అన్నీ తానై భరోసాగా నిలిచిన సీఎం జగన్.
– కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు, అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారు.
– జగనన్న వల్లే సాధ్యమయ్యే పాలన ఇది. మన పిల్లలు సంతోషంగా బడులకు వెళ్తూ మంచి చదువులు చదువుతున్నారు. 
- మనం ఈరోజు ధైర్యంగా నిలబడి, ముందుకు సాగుతున్నమంటే అందుకు జగనన్నే కారణం.
– గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చులకనగా చూసి, అవమానించిన చంద్రబాబు.
– ఆయా వర్గాలను అక్కున చేర్చుకుని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేర్చాలని తపిస్తున్న జగనన్న.

మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మాట్లాడుతూ...

– ఈ సభకు వచ్చిన అశేష ప్రజల్ని చూస్తుంటే, అణగారిన వర్గాల్లో జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగనన్న సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్థాయిని పెంచారు.
- బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ మేలు చేసిన పాలకుడు మన జగనన్న.
– మన భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నేను మళ్లీ సీఎం చేసుకోవాలి. 
– చంద్రబాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ టీడీపీ వాళ్లు వస్తున్నారు. తెలుగు దేశం పార్టీకే గ్యారంటీ లేదు.
- నమ్మితే మోసపోయినట్టేనని ప్రజలందరికీ తెలుసు. అలాంటి చంద్రబాబు మనకొద్దు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ...

– వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఒక సామాజిక విప్లవం.
– మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనలాంటి నాయకుడు మరొకరు లేరు. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చట్టసభల్లో అగ్రపీఠం వేసిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.
– చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేశాడో మనకు తెలుసు. ఓటుకు నోటు కేసు మనకు తెలుసు. 
- వ్యవసాయం దండగ అన్న పెద్ద మనిషి చంద్రబాబు. ఆయన చేతిలో మోసపోని వర్గమంటూ ఒక్కటీ లేదు.
– ఆయన మాయమాటలతో మళ్లీ మనల్ని మోసం చేయడానికి బయలు దేరుతున్నాడు. 
- ఆయన గతాన్ని ఓసారి గుర్తు చేసుకుని, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ....

– జగనన్న పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి.
– తన పాదయాత్రలో మన సమస్యలు తెలుసుకున్న జగనన్న, అధికారంలోకి వచ్చాక ఊహించనంత వేగంగా వాటిని పరిష్కరించారు.
– మనం కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అందించి మన కుటుంబాల ఆర్థికస్థాయిని పెంచారు. 
– చదువుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్‌మోహన్‌రెడ్డి చలవ వల్ల, మన పిల్లలు ఈరోజు ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు.
– కార్పొరేట్‌స్థాయి విద్య మన పిల్లలకు అందుబాటులోకి వచ్చిందంటే అది జగనన్న ఘనతే.
– దోచుకో.. దాచుకో అన్నదే చంద్రబాబు ఫిలాసఫీ. ఆయన వల్ల పేదలకు జరిగిన మంచి లేదు. 
– మనకోసం వచ్చిన నాయకుడు జగనన్న. మన మేలుకోరే నాయకుడు జగనన్న. 
– పేదరికాన్ని గణనీయంగా తగ్గించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ...

- కరోనా రోజుల్లో రాప్తాడు ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకున్నాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి పనిచేసిన తీరు ప్రజల ప్రాణాల్ని నిలబెట్టింది. 
– పేరూరు డ్యాంకు మూడు సంవత్సరాలు వరుసగా నీళ్లు తీసుకొచ్చాం. 
- నాల్గో సంవత్సరం వరుణదేవుడి ఆశీస్సులతో వర్షాలతో డ్యాం నిండింది. మూడు రిజర్వాయర్లు తెచ్చుకున్నాం. 
– నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయలను డీబీటీ, నాన్‌ డీబీడీ ద్వారా రాప్తాడు ప్రజలకు అందించిన సీఎం వైయ‌స్ జగన్.
– అలవిగాని హామీలిచ్చి అధికారంలో రావాలన్నదే చంద్రబాబు కుటిల నీతి.
– అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ ఈరోజు జగనన్న పెద్ద అండ. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లల పెద్ద చదువుల కోసం జగనన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. 
– రాప్తాడు నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్‌. 
– పీఏబీఆర్‌ నుంచి పైప్‌ లైన్‌ ద్వారా ఆత్మకూరు, అనంతపురం రూరల్‌కు నీరు ఇచ్చి.. ఇంటింటికీ కుళాయి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
 

తాజా వీడియోలు

Back to Top