శ్రీకాకుళం: ఎన్నికల సమయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక పింఛన్ల పెంపు విషయమై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ ప్రకారం దశల వారిగా ఈ నాలుగున్నరేళ్లలో పెంచుతూ పెంచుతూ ఇవాళ ఈ జనవరి ఒకటి నుంచి నూతన సంవత్సర కానుకగా..మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం,సింగుపురం గ్రామంలో వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానికులతో, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మమేకం అయి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన విధంగా..ప్రతి ఏడు పెన్షన్ పెంచుతూ ఇస్తాం అని,అలానే ప్రతి సంవత్సరం రూ.250 పెంచుతూ..నేడు రూ.3,000 ఇస్తున్నాం. మళ్ళీ సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలూ కొనసాగుతాయి. విపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తెలియదు. ఇదే విషయం మీకు గతంలో కూడా అనుభవం. కానీ వైయస్ జగన్ అలా కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలన సాగిస్తున్న ఏకైక నేత. అధికారం వచ్చేవరకూ ఒక మాట, వచ్చాక మరోమాట..చంద్రబాబు చెబుతారు. కానీ జగన్ చెప్పారంటే..చేస్తారంతే అన్న విధంగా ఉంటారు. పేదలకు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చి,కట్టుబడి జనక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడతారు. ఆర్థిక భారం అయినా కూడా సంక్షేమ పథకాల అమలును అడ్డుకున్న దాఖలాలు లేనేలేవు. నిలుపుదల చేసిన వైనం కూడా లేదు. ఇవాళ దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం వేరేది లేదు. చాలా గ్రామాల్లో కనీస సొంత ఇల్లు లేకుండా చాలా ఏళ్ల నుంచి ఉంటు న్నవారు ఉన్నారు. అలాంటి వారి అందరికీ సొంత ఇంటి కల నెరవేర్చాం.సింగుపురం గ్రామంలో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. పక్క రాష్ట్రం ఒడిశాతో వివాదం నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా హిరమండలం గొట్టా దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసి వేసవికి వంశధార నీరు అందించ వచ్చు. ఇదే మాట సీఎం జగన్ కు అసెంబ్లీలో చెబితే,లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.185 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం సంబంధిత పనులు జరుగుతున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో మాకు ఏమీ దక్కలేదు అన్న కుటుంబాలకు ఈ రోజు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంది. రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతోంది. జీవన ప్రమాణాలు పెంచింది. అలానే వారి సొంత ఇంటి కల నెరవేర్చిం ది. వారి పిల్లల ఉన్నత చదువుల విషయమై అప్పటిదాకా నెలకొని ఉన్న నిరుత్సాహం తొలగించాం. ధైర్యం కల్పించాం. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, రాష్ట్ర శయన కార్పొరేషన్ చైర్మన్ డి.పి దేవ్, ఎంపిపి అంబటి నిర్మల, రూరల్ మండలం అధ్యక్షులు చిట్టి జనార్ధన రావు, ఏయెంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, సర్పంచ్ ఆదిత్య నాయుడు, ఎంపీటీసీ లు బగ్గు అప్పారావు, నక్క శంకర్, నాయకులు గుండ మోహన్, రంది రాజారావు, ఏమ్యేల్బి శాస్త్రి, ఏమర్వో వెంకట్రావు, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.