మ‌హిళ‌ల‌ ముఖాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం సంకల్పం 

వైయ‌స్ఆర్‌ చేయూత సంబరాల్లో రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 
 

శ్రీ‌కాకుళం :  మ‌హిళ‌ల‌ ముఖాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంకల్పమ‌ని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. గార మండ‌ల ప‌రిష‌త్‌ కార్యాలయం ప్రాంగణంలో మూడో విడత వైయ‌స్ఆర్‌  చేయూత పథకం   సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ అందరి ముఖాల్లో ఆనందం చూడాలన్న సంకల్పంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలను అనువర్తింపజేస్తున్నామని అన్నారు. 
 
ఇంటి ఇల్లాలు కుటుంబానికి యజమాని కావాలని భావించిన ప్రభుత్వం ఇది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తినీ తీర్చిదిద్ది, ప్రయోజకులను చేసి, వారి ఉన్నతి కి కృషి చేసే అక్క చెల్లెళ్లకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. ఈ ఆలోచనతోనే మూడేళ్ల కిందట మీరంతా ఇచ్చిన అధికారాన్ని అందిపుచ్చుకుని మీ నాయకత్వాన్ని మీ ఇళ్లల్లో బలోపేతం చేయాలని మీరు సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ఇవన్నీ ఎన్నికల కన్నా ముందే చెప్పాం. అధికారంలోకి రాగానే వీటిని ప్రారంభించాం. ఇప్పుడు కూడా డబ్బులు జమ చేస్తున్నాం అంటే ఎలక్షన్ల కోసం కాదు.. ఎలక్షన్లకు ఇంకా చాలా సమయం  ఉంది. ఇదే చంద్రబాబు అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు ఎంతో కొంత డబ్బులు వేయడం మిగతా మొత్తాలను ఎగవేయడం వంటివి చేసేవారు.కానీ మన నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అటువంటి పనులు చేయరు. మీకు ఇప్పటికే ఈ  ప్రభుత్వం అంటే నమ్మకం ఏర్పడింది. ఇన్ని కార్యక్రమాలు మీకు జరగడానికి, ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే నిజానికి మీ వల్లే జరుగుతున్నాయి. మీరు ఓటేసి గెలిపించడం వల్లే ఇవన్నీ సాధ్యం అయ్యాయి. ఒకవేళ మీరు ఇవ్వన్నీ వద్దనుకుంటే, మాకు ఈ సంక్షేమ పథకాలు ఏవీ అవసరం లేదు అని భావిస్తే, మా కుటుంబాలను నడుపుకునే శక్తి మాకుంది అని మీరు కోరితే మేమే ఆపేస్తాం. ఒకవేళ నడపాలంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలా వద్దా ?  ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్టే శ‌క్తి మీకు ఉంద‌న్న విష‌యం మీకు తెలియాలి. నేను ఇంకో విష‌యం అడుగుతాను. 

ఈ రాష్ట్రంలో విప‌క్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఏం చెబుతున్నారంటే ప్ర‌తి ఒక్క‌రికీ డ‌బ్బులు పంచి, వారిని సోమ‌రి పోతుల‌ను చేసి డ‌బ్బంతా వైయ‌స్ జ‌గ‌న్ దుర్వినియోగం చేస్తున్నాడ‌ని చెబుతున్నారు. నిజంగా ఇదంతా దుర్వినియోగమా ? అంటే మీ పిల్ల‌ల‌కు నాణ్యం అయిన విద్య అందించ‌డం దుర్వినియోగ‌మా..లేదా నిలువ నీడ లేని వారికి ఇల్లు క‌ట్టించి ఇవ్వ‌డం దుర్వినియోగమా ? అప్పుల్లో ఉన్న రైతుకు సాయంగా ఉండ‌డం త‌ప్పా ? ఆ రైతుకు పెట్టుబ‌డి సాయం అందించ‌డం దుర్వినియోగ‌మా ? డ్వాక్రా రుణాలు తీర్చాల‌నుకోవ‌డం, ఆ విధంగా ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో మీ అప్పు తీర్చి, మ‌రో విడ‌త తీర్చేందుకు సిద్ధం అవుతుండ‌డం దుర్వినియోగ‌మా ? అందుకే అడుగుతున్నాను దుర్వినియోగ‌మా చెప్పండి. మేమే వెంట‌నే తీసేస్తాం. ఆయ‌న దాకా ఎందుకు ? ఏదేమ‌యినా మేం చెప్పేదొక్క‌టే ఈ స‌మాజంలో అట్ట‌డుగు వ‌ర్గాల ఉన్న‌తికి కృషి చేయ‌డం అన్న‌దే మా ధ్యేయం.  వారి కోసం అవ‌స‌రం అయిన ప‌థ‌కాలను రూప‌క‌ల్ప‌న చేసి అభివృద్ధి చేయ‌డం అన్న‌ది మా లక్ష్యం. మ‌రి ఇది అభివృద్ధి కాదా ? కుటుంబాలు అభివృద్ధి చెంద‌డం అన్న‌ది అభివృద్ధి కాదా ? కుటుంబాలు అన్నీ  క‌లిస్తే క‌దా స‌మాజం.. అంటే పెద్ద పెద్ద బిల్డింగులు క‌ట్ట‌డమే అభివృద్ధా.. అభివృద్ధి అంటే అన్ని కుటుంబాలూ అభివృద్ధి చెంద‌డం. అని విన్న‌వించుకుంటు న్నాను. అందుకే ఉదాశీనంగా ఉండ‌కండి.. మీరు విష ప్ర‌చారాన్ని అడ్డుకోండి. విపక్ష పార్టీ నేత‌ల‌ను వెంట‌బ‌ట్టి త‌రిమికొట్టండి అని పిలుపునిస్తున్నాను. 

  సంతోషంగా మీరు ఉండ‌డం కోసం కొంద‌రిని నేను వ్య‌తిరేకించాలి. న‌ల‌భై నుంచి అర‌వై ఏళ్ల మ‌ధ్య వ‌యస్సు ఉన్న వారు ఉన్నారు. మీరంతా తోటి వారికి చెప్ప‌గ‌ల‌గాలి అని అన్నారు. ప‌థ‌కాలు అందుకున్న వారు వీటి గురించి మాట్లాడాలి. విప‌క్షాల విష ప్ర‌చారం తిప్పికొట్టాలి. దేశంలో ఏ ఇత‌ర రాష్ట్రంలో అయినా ఉన్న ధ‌ర‌ల‌తో ఇక్క‌డి ధ‌ర‌ల‌ను పోల్చాలి. ప‌థ‌కాలు వ‌ద్దు అని 
చెబితే ప్ర‌శ్నించండి. మ‌న ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌కొట్టే వారిని నిల‌దీసే హ‌క్కు మీకు లేదా ? అని ప్ర‌శ్నించారాయ‌న.

ఎంపిపి గోండు రఘురాం, ఎమ్మార్వో, ఎంపిడివో, జెడ్పిటిసి మార్పు సుజాత, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, మార్పు ధర్మారావు, వైస్ ఎంపిపి బరాటం రామశేషు,  ముకళ్ల తాత బాబు, ముంజేటి కృష్ణ, పీస గోపి, పీస శ్రీహరి, మార్పు పృథ్వి, యల్లా నారాయణ, కొయ్యాన నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు

కుందువాని పేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం  

శ్రీ‌కాకుళం  : కుందువానిపేట‌లో రెవెన్యూ శాఖా మాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గ‌డప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఇప్ప‌టికే మ‌త్స్యకార భ‌రోసా వంటి ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంద‌ని అన్నారు. అదేవిధంగా తీర ప్రాంత అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని , ఇందుకు సంబంధించిన పనులు కూడా చేపడుతున్నామ‌ని అన్నారు. మ‌ర బోట్ల‌కు ఆయిల్ స‌బ్సిడీ అందిస్తున్నామ‌ని అన్నారు. గ‌తంలో కూడా మ‌త్స్య‌కార నాయ‌కుల‌కు త‌గిన ప్రోత్సాహం అందించామ‌ని అందుకు 
ఆ రోజు జుత్తు జ‌గ‌న్నాయుకులు కానీ ఇవాళ సీదిరి అప్ప‌ల రాజు కానీ ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ద్వారానే జీవ‌న ప్ర‌మాణాల మెరుగుద‌ల అన్న‌ది సాధ్యం అని స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని  చాటుతూ తాము పాల‌న సాగిస్తున్నామ‌ని, ఆ విధంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని అన్నారు. మేం అధికారంలోకి వ‌చ్చాక డ‌బ్బులు పంచేస్తున్నాం అంటూ విప‌క్షాలు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నాయ‌ని వాటిని మాత్రం అస్స‌ల‌స్సలు న‌మ్మ‌వ‌ద్ద‌ని అన్నారు. ప‌థ‌కాలు అందుకుంటున్న ల‌బ్ధిదారులు ఆర్థిక స్వావ‌లంబ‌న, పురోగతి సాధించాల‌ని, అటుపై విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను వారంత‌ట వారే ముందుకు వ‌చ్చి, ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం అని, మా  మేలు కోరే ఈ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అని 
చెప్ప‌గ‌ల‌గాలి అని అన్నారు. ఆ విధంగా వలంటీర్లు కానీ ఇత‌ర గ్రామ స‌చివాల‌య సిబ్బంది కానీ ప‌థ‌కాల అమ‌లు, వ‌ర్తింపు పై ల‌బ్ధిదారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. అస‌లు సంక్షేమం అమ‌లు అయితేనే కోవిడ్ లాంటి దుర్భ‌ర అవ‌స్థ‌ల్లో కూడా ప్ర‌జ‌ల‌కు మూడు పూట‌లా అన్నం అందింద‌ని, అదేవిధంగా తాము ఏ మంచి ప‌ని చేసినా వాటిపై దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని విప‌క్ష స‌భ్యుల‌కు హిత‌వు చెప్పారు. అదేవిధంగా విప‌క్షాలు బాదుడే బాదుడు అంటూ ధ‌రల విష‌య‌మై నానా యాగీ చేస్తున్నాయ‌ని, వీటిని కూడా న‌మ్మ‌వ‌ద్ద‌ని, ధ‌ర‌ల విష‌య‌మై పొరుగు రాష్ట్రాల‌తో పోల్చి చూడాల‌ని కోరారు. హుద్ హుద్ ఇళ్ల కేటాయింపులో ద‌ళారులెవ‌రికైనా లంచం ఇచ్చారా మీరు ? చెప్పండి ఎస్పీకి చెప్పి అరెస్టు చేయిస్తా.. అని అన్నారు.

 అనంత‌రం మ‌త్స్య‌కార భ‌రోసా కింద కుందు ల‌క్ష్మ‌మ్మ‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందించారు. ల‌బ్ధిదారు కుటుంబంతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి నిర్మల శ్రీనివాసరావు, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, అంబటి శ్రీనివాసరావు, సర్పంచ్ సురాడ సూర్యం, ఎచ్చెర్ల శ్రీధర్, చిట్టి జనార్ధనరావు, చల్లా రవి కుమార్,  రొక్కం సూర్య ప్రకాష్, గోండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top