శ్రీశైలం నియోజకవర్గంలో దగా డీఎస్సీపై రిలే నిరాహార దీక్షలు 

 డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాలి.. మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి డిమాండ్‌

ఆత్మకూరు : డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు టౌన్ బస్టాండ్ ఎదురుగా గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు, శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
 

Back to Top