అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. బుధవారం శాసన మండలిలో మంత్రి రజినీ మాట్లాడారు. మంత్రి విడదల రజినీ ఏమన్నారంటే.. ►ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి ►105 రకాల మందులు 14 రకాల టెస్టులు చేస్తున్నారు. ►పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక డాక్టర్ విధులు నిర్వహిస్తూ మరొక డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో పాల్గొంటున్నారు. ►జీరో వేకెన్సీ విధానాన్ని సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారు. ►రాష్ట్రంలో 53 వేల 190 మంది మెడికల్ స్టాఫ్‌ను రిక్రూట్మెంట్ చేశాము. ►పేదవారికి ఆరోగ్య సమస్యలు వస్తే గతంలో వైద్యం అందని పరిస్థితి ఉండేది, టెస్టులో పరికరాలు కొరతగా ఉండేవి. ►సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రామస్థాయిలోనే వైద్య సేవలను మెరుగుపరిచారు. ►ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రెండు కోట్ల 30 లక్షల మంది ఈ సేవలనువినియోగించుకున్నారు. ►సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. ►8500 కోట్లతో ఈ కళాశాలలో ఏర్పడనున్నాయి. ►ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండా లన్నది సీఎం ఆకాంక్ష. ►ఈ విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ►150 మెడికల్ సీట్లతో ఐదు మెడికల్ కాలేజీలలో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ►రానున్న విద్యాసంవత్సరాల్లో మరిన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ►భారత దేశ చరిత్రలోనే నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటుతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు.