ప్రధాని మోదీకి వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు

 ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి:  గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, అనంతరం భారత ప్రధానమంత్రిగా వరుసగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన వైయ‌స్‌ జగన్‌.. ప్రజా సేవలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ ప్రజా సేవా ప్రస్థానం ప్రధానమంత్రిగా కొనసాగుతోందని పేర్కొన్న వైయ‌స్‌ జగన్‌.. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు.

Back to Top