దెందులూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులపై ఒత్తిళ్లు!

 మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఫైర్‌

ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను కిడ్నాప్‌లు, డబ్బు ఆశలు, అక్రమ కేసుల బెదిరింపులతో పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని  మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిప‌డ్డారు.  అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో అబ్బయ్య చౌదరి స‌మావేశ‌మ‌య్యారు. అభ్యర్థులకు అండగా ఉంటూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే వాతావరణం కల్పించాలని ఆయ‌న కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభ్యర్థుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top