ఎంపీ విజయసాయిరెడ్డి లేఖకు స్పందించిన రాష్ట్రపతి

సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై విచారణ జరపాలని ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై విచారణ జరపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐ చేత సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి ఫిర్యాదును హోంశాఖకు పంపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి లేఖను సంబంధిత శాఖలకు కేంద్ర హోంశాఖ పంపించింది. 
 

Back to Top