వైయస్‌ కుటుంబంపై విషప్రచారం

ఓట్ల కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు

బాబు ఆరోపణలను సాక్షాధారాలతో తిప్పికొట్టిన లీగల్‌ సెల్‌

టీడీపీ దుష్ప్రచారంపై వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు ధ్వజం

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును వారి కుటుంబ సభ్యుల మీదకు మళ్లించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని, ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ వివేకానందరెడ్డి మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఎందుకు చెప్పలేదు, పోస్టుమార్టం చేసి పెట్టేదాక ఎందుకు దాచారు. ఎందుకు గుండెపోటు అని చిత్రీకరించారు. ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు వక్ర బుద్ధితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ వివేకా చనిపోయిన రోజు ఉదయం 8 గంటలకే ఫిర్యాదు చేశామని, ఫిర్యాదులో నుదుటి మీద, తోడ, చేతులు, తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయని పేర్కొన్నామన్నారు. చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి ప్రజల దృష్టి మరల్చేందుకు వైయస్‌ కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

  • చంద్రబాబు చేస్తున్న విష ప్రచారంపై నిజాలు బయటపెట్టేందుకు రెండ్రోజులుగా వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో రిపోర్టులన్నీ సేకరించాం. 
  • నామమాత్రంగా సిట్‌ వేసి విచారణ నేపథ్యాన్ని, గతిని తనకు అనుకూలంగా నడుపుతున్నాడు. 
  • వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రుద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మార్చి 18వ తేదీన డక్కన్‌ క్రానికల్‌ విజయవాడ ఎడిషన్‌లో వచ్చింది. 
  • ఇది వాళ్ల కుటుంబీకులు చేసుకున్నారని, వాళ్ల ప్రమేయం ఉందని విచారణ మొదలుపెట్టకముందే చంద్రబాబు విచారణ అదికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. 
  • పాత రోజుల్లో ఒక సామెత ఉంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే వల్లగాక ఒకడు ఏడుస్తున్నాడంట. ఇంటి పెద్దను కోల్పోయి వైయస్‌ కుటుంబం దిగులుతో ఉంటే దీన్ని తనకు ఆసరాగా వాడుకుంటూ చంద్రబాబు అనే దుష్ప్రచారం చేస్తున్నారు. 
  • ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బదనం చేయాలనుకున్నాడు. 
  • ఎంత నిసిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడంటే. 8 గంటలకు కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో క్రైమ్‌ నంబర్‌ 84–2019, 156 సీఆర్‌పీసీ కింద కేసు రిజిస్టర్‌ అయింది. 
  • పోస్టుమార్టం దాకా గాయాలున్నాయని దాచిపెట్టారన్నది అబద్ధం. తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాడు. 
  • శవ పంచనామా చేయకుండా ఎలా తరలించారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. శవ పంచనామా ఉదయం 9 గంటలకే జరిగింది. కావాలంటే చంద్రబాబు పోలీసుల రిపోర్టు చూడండి. 
  • ఎఫ్‌ఐఆర్‌లోని కాలం నంబర్‌ 7లో ఉదయం 9 గంటలకు జరిగిన పంచనామాలో ప్రతి ఒక్క గాయం స్పష్టంగా రాసి ఉంది. 
  • రక్తపు మరకలు తుడిచివేశారని మరో అబద్ధం చెబుతున్నారు. 
  • ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన తరువాత పోలీసులు తీసిన ఫొటోల్లో రక్తపు మరకలు చెరిపినట్లుగా ఉన్నాయా..చంద్రబాబూ ఒకసారి చూసుకో.. 
  • ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఎన్నికల కోసం దురదృష్టకరమైన హత్య కేసును తప్పుదోవపట్టించడం ఎంతవరకు సమంజసం. 
  • కొత్తబట్టలు వేశారని నిసిగ్గుగా అబద్ధం చెబుతున్నారు. పంచనామాలో వైయస్‌ వివేకా నైట్‌ డ్రెస్‌ వేసుకున్నారని క్లియర్‌గా ఉంది. వైయస్‌ కుటుంబంపై ఇంత దురదృష్టకరమైన అపవాదు వేశారు. 
  • ఇవన్నీ పక్కనబెడితే.. విచారణ వేసిన మరుక్షణం చంద్రబాబు లైన్‌లోకి వచ్చి వారి కుటుంబ సభ్యులే చేయించారని నిసిగ్గుగా చెప్పారు.  
  • రాజకీయ లబ్ధి కోసం వైయస్‌ కుటుంబంపై అపవాదలు వేస్తున్నారు. రెండ్రోజులుగా శ్రమించి సాధించిన సాక్షాధారాలు. దీనికి జవాబు చెప్పు చంద్రబాబూ.. 
  • ఎఫ్‌ఐఆర్‌ కాలం నెంబర్‌ 15లో ఈ మరణం గాయాల వలన సంభవించిందని రాసి ఉంది. రికార్డు ప్రకారం కూడా హత్య గాయాల వల్ల జరిగిందని చెప్పారు. 
  • చంద్రబాబు సిట్‌ వేసి ఏ పట్టాలపై వేసి నెట్టాలని ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. 
  • ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చి దాని ప్రకారం విచారణ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. వైయస్‌ కుటుంబంపై దాడి చేసి పబ్బం గడుపుకోవాలంటే ఇంతకంటే నీచ రాజకీయ నాయకుడు ఎవరూ ఉండరు.  

తాజా వీడియోలు

Back to Top