`నాడు-నేడు`కు పోక‌ర్ణ గ్రూప్ రూ.కోటి విరాళం

తాడేప‌ల్లి: నాడు - నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్‌ టూ ఆంధ్ర ద్వారా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్ కింద‌ పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం అంద‌జేసింది. విరాళానికి సంబంధించిన చెక్కుని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌కు పోకర్ణ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top