ప్లీన‌రీ సీడీల ఆవిష్క‌ర‌ణ‌

గుంటూరు:  ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీకి సంబంధించిన సీడీల‌ను వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, విశ్వ‌రూప్‌, ఎమ్మెల్యేలు ఆవిష్క‌రించారు. నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైయ‌స్సార్‌సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రులు గురువారం పరిశీలించారు. ఈ రోజు సాయంత్రానికి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు పాస్‌లు పంపిణీ చేయనున్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్‌ జగన్ నెరవేర్చారన్నారు. విధానపరంగా పలు మార్పులు తీసుకొచ్చామన్నారు. 

Back to Top