కాకినాడ: కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు కండువా వేసి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పంతం.ఇందిర, పంతం నెహ్రూ, పంతం ప్రసాద్. పిఠాపురం నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పంతం ఇందిర.