తాడేపల్లి: చంద్రబాబూ నోటిని అదుపులో పెట్టుకో...నీవు గెలిచే పరిస్దితి లేదని గుర్తుంచుకో అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్‌బాబు హెచ్చరించారు. చంద్రబాబు దుర్మార్గ, హత్యా రాజకీయాలకు ప్రజలు త్వరలో సమాధి కడతారన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం వైయస్ జగన్ పై చంద్రబాబు, పవన్ లు వ్యక్తిగతంగా పదే పదే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఓటమి కళ్ల ఎదుట కనిపిస్తుండంతో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. వైయస్ జగన్ గారిపై నోరుజారావ్. ఎవరు ఎవరికి సమాధి కట్టారో గుర్తుతెచ్చుకో అని హెచ్చరించారు. ఆ హత్యాలు చేసింది నీవు కాదా బాబూ? వంగవీటి రంగాను హత్య చేసింది నువ్వు కాదా.పత్తికొండలో నారాయణరెడ్డి గారిని చంపించింది నీవు కాదా అని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు హెచ్చరించారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో నీ ప్రచార యావకోసం 20 మందిని పైగా చంపించింది నీవు కాదా అని నిలదీశారు. పడవప్రమాదంలో 26 మందిని విజయవాడలో చనిపోవడానికి కారణం నీవు కాదా చంద్రబాబూ. నీ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశావు. ఇవన్నీ తెలిసే 2019 లో ప్రజలు నీకు (చంద్రబాబు) రాజకీయ సమాధి కట్టారు 2018 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మీరు చెప్పారు. నేటి మేనిఫెస్టోలో కూడా టిడిపి పోలవరం పై స్పష్టత ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మేనిఫెస్టోను బిజేపి ఎందుకు పట్టుకోలేదు.మీ ఎన్నికల హామీలకు బిజేపి కూడా బాధ్యత వహిస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. విభజన హామీల అమలు గురించి బిజేపి గురించి ఎందుకు క్లారిటీ తీసుకోలేకపోయారు. టిడిపి చెత్త మేనిఫెస్టో....బూటకపు ప్రజావంచన మేనిఫెస్టో...అది ఒక టిష్యూ పేపర్ అని అభివర్ణించారు. 2014లో పవన్ కల్యాణ్,నరేంద్రమోది,చంద్రబాబు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలౌో ఫెయిల్ అయ్యారు. మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేని మీరు ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మేపరిస్దితి లేదన్నారు. ప్రజలలో వైయస్ జగన్ గారికున్న విశ్వసనీయత చంద్రబాబుకు,పవన్ కల్యాణ్ కు లేదని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పేర్కొన్నారు. నిబధ్దతతో పాలన చేస్తున్న వైయస్ జగన్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.