తాడేపల్లి: రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో ఓట్లు దండుకుందామని ముగ్గురూ మూడు ప్రాంతాల్లో తిరిగి అసత్యాలు చెప్తున్నారు.- అయితే ఓటుతో వీరందరికీ ప్రజలు త్వరలోనే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి వాళ్లు అనేది ప్రజలందరికి తెలుసు అన్నారు. వంగవీటి రంగాని జర్నలిస్ట్ దశరధ్ రామ్ ను చంపించినది తెలుగుదేశం వాళ్లు కాదాఅని ప్రశ్నించారు. ఐఏఎస్ ఆఫీసర్ రాఘవేంద్రరావు చంపించినది చంద్రబాబు అనేది బహిరంగ రహస్యమన్నారు. ఇలా హత్యా రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడటం ఏంటని నిలదీశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని నాగార్జున యాదవ్ హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వలేని వారు నాయకుడా అని విమర్శలు చేస్తున్న చంద్రబాబు....ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి తన లోకేష్ కు మాత్రం ఉద్యోగం ఇచ్చారన్నారు. వైయస్ జగన్ గారిని బాండేజ్ బబ్లూ అని లోకేష్ ఓవర్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు రోగాలన్నీ చంద్రబాబుకే ఉన్నాయని బెయిల్ కోసం లోకేష్,కుటుంబసభ్యులందరూ చెప్పారు. నేడు చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతున్నాడంటే ఆ రోగాలన్నీ పోవడానికి పసరు ఏమైనా చంద్రబాబుకు పోశారా. దానికి ఫార్ములా ఉంటే రాష్ర్ట ప్రజలకు చెప్పండి.లోకేష్ ను ఫ్యాటీ బంటీ అని పిలిస్తే సరిపోతుందా అన్నారు. వైయస్ జగన్ గారిపై తప్పుడు ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోమని నాగార్జున యాదవ్ ఫైర్ అయ్యారు. పవన్ కూడా దోచుకోవడం డిఎన్ ఏ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.ఇలా పరిటాల ఆస్దులు దోచుకోవడానికి ట్రై చేయబట్టే గుండు కొట్టించారు అని చెబుతారు.అది గుర్తు చేసుకో పవన్ అని సూచించారు.