తాడేపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ‘సిద్ధం’ పేరిట బహిరంగ సభలు, ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం వైయస్ జగన్ ప్రజల్లో భరోసాని, పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపారు. మలివిడత ప్రచారంలో భాగంగా రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైయస్‌ఆర్ సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అబద్ధాలను, మోసాలను, కుట్రలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. కలలు నిజం చేయడానికి ‘‘జగన్ కోసం సిద్ధం’’ పేరుతో నూతన కార్యక్రమానికి వైయస్‌ఆర్ సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని నేడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభించారు. మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే ‘‘జగన్ కోసం సిద్ధం’’ కార్యక్రమం లక్ష్యం. పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను వైయస్‌ఆర్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గొనున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా.. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99 శాతం నెరవేర్చి ప్రజల్లో స్థిరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏర్పరుచుకున్నారు సీఎం వైయస్ జగన్. నేటి నుంచి చేపట్టబోయే ‘‘జగన్ కోసం సిద్ధం’’ కార్యక్రమం ద్వారా స్టార్ క్యాంపెయినర్లు, పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించనున్నారు.