బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ

తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Back to Top