జూన్ 4న పేదల ప్రభుత్వం ఏర్పాటవుతుంది

విశాఖలోనే ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

చంద్రబాబు దొంగ మాటలు నమ్మి బెట్టింగులు పెట్టి నష్టపోవద్దు

వాళ్ల ఫ్రస్టేషన్‌ చూసి అల్లర్లకు దిగుతారని ముందుగానే ఊహించాం

తొందరెందుకు.. అది బలుపో.. వాపో జూన్ 4 తెలుస్తుందిగా?

చంద్రబాబు అంటేనే మాయ, మోసం, దగా

మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్న నాయకుడు వైయ‌స్ జగన్‌కి ప్రజలు పట్టం కట్టారు

మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ అభ్య‌ర్థి శ్రీ‌మ‌తి బొత్స ఝాన్సీ

విశాఖ‌ప‌ట్నం: టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయ‌స్‌ జగన్‌ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రల్లో వైయ‌స్‌ జగన్‌ చేసిన సంక్షేమాలు, దాన్నే కొనసాగిస్తానన్న వైయ‌స్‌ జగన్‌ మాటలకు ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా లబ్ధిపొందిన మహిళలు 74 శాతం ఉన్నారని, వారంతా నా అన్న, తమ్ముడు మా ఆత్మగౌరవాన్ని కాపాడారని ఓటు వేయడానికి వెల్లువెత్తారన్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు తమ గౌరవాన్ని తమ బిడ్డ వైయ‌స్‌ జగన్‌ పెంచారని ఉదయాన్నే వచ్చి ఆశీర్వదించారన్నారు. టీడీపీ ఎన్నో కుతంత్రాలు పన్నింది. ఎన్నో అబద్ధాలు చెప్పిందని, సడన్‌గా లేని చట్టాన్ని ల్యాండ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చి రైతులను మభ్య పెట్టాలని చూశారు. కానీ రైతులు నమ్మలేదన్నారు. విశాఖ‌ప‌ట్నంలో వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎంపీ అభ్య‌ర్థి బొత్స ఝాన్సీ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏమ‌న్నారంటే..
సంక్షేమాన్ని ఆపడానికి చంద్ర‌బాబు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ ప్రచారం చేశారు. ప్రజలకు వారు చేసిన మోసాలన్నీ తెలిసిపోయాయి. రాజకీయాల్లో చెప్పింది చేయడం ముఖ్యం. నిజాయితీ అవసరం. మాట తప్పడు మడమ తిప్పడు అనే బ్రాండ్ వైయ‌స్‌ జగన్‌కి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వద్ద నుంచి వచ్చింది. జూన్‌ 4వ తేదీన ప్రజల తీర్పు వస్తుంది. ఆ తర్వాత ప్రమాణస్వీకారం జరుగుతుంది. వైయ‌స్ జగన్‌ ఇక్కడికే వచ్చి ప్రమాణస్వీకారం చేస్తారు..ఆ తేదీ కూడా త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ప్రభుత్వ సంస్కరణలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తారు. విద్య, వైద్యంలో అభివృద్ధిని కొనసాగిస్తూ.. విశాఖ విజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం.

కూటమి దిగజారుడు రాజకీయాలు చేసింది
ఈ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. వాళ్లు పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా పోరాడిన వారికి కృతజ్ఞతలు. ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ ఉపయోగించారు. ఆఖరికి స్వయాన నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ఫేక్‌ లెటర్‌ కూడా విడుదల చేశారు. ఏ స్థాయికి టీడీపీ, ఆ కూటమి దిగజారిందనే దానికి ఇది ఒక మచ్చుతునక. టీడీపీకి, చంద్రబాబుకు ఉన్న చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు అంటేనే మాయ, మోసం, దగా. ఏదైనా చెప్పింది చేస్తారు.. చేసేదే చెప్తారనే నమ్మకం రాజశేఖరరెడ్డి, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిలదనే విషయం కూడా ప్రజలకు తెలుసు. రైతు పెట్టేవాడిగా ఉండాలే అనీ.. పట్టేవాడిగా ఉండకూడదని నమ్మిన నాయకులు వారు. పేదవాడు..అలాగే పేదరికం మగ్గిపోకూడదని తలచిన నాయకులు వైయ‌స్సార్, వైయ‌స్ జగన్‌. ఈ ఐదేళ్ల నా పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు ఈ దేశంలో వైయ‌స్‌ జగన్‌ తప్ప ఎవరూ లేరు. అందుకే ప్రజలు ఆయన్ను నమ్మి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. వైయ‌స్ జగన్‌కి అండగా నిలిపిచన తల్లులకు, మహిళామణులకు, సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి పనిచేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సచివాలయ వ్యవస్థ పెట్టి కార్యకర్తలను పట్టించుకోలేదు అని విమర్శించారు. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో కార్యకర్తల ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. సచివాలయ వ్యవస్థ పెట్టింది అవినీతి రూపుమాపడానికి మాత్రమే. జన్మభూమి కమిటీల దోపిడీని అరికట్టి ప్రజల ఇంటివద్దకే సేవలు అందించేందుకే ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. కార్యకర్తల ఎప్పుడూ నాయకుడు గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఈ భావనను మా కార్యకర్తలంతా అర్ధం చేసుకున్నారు. వాలంటీర్‌ వ్యవస్థ దిగ్విజయంగా సేవలందించింది. కరోనా సమయంలో, సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించడంలో వారి సేవలు దేశం మొత్తం ప్రశంసలు పొందింది.

వాళ్ల ఫ్రస్టేషన్‌ చూసి అల్లర్లకు దిగుతారని ముందుగానే ఊహించాం
పోలింగ్‌ నాడు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేశారు. మేం సంయమనం పాటించాం. వాళ్ల తీరు చూసే మా కార్యకర్తలకు ముందే చెప్పుకున్నాం. చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కరూ సహనం కోల్పోయి ఎన్నికల్లో పాల్గొంటున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించాం. సభ్య సమాజంలో ఎవరూ వినని భాష మాట్లాడుతున్నారు..రెచ్చగొట్టారు..ఇలా ఎన్నో చేశారు. వారి మాటలు, చేతలు పోలింగ్‌ రోజు ఇంకా ఉధృతంగా ఉంటాయని మేం ముందే అంచనా వేశాం. మనముందున్న కర్తవ్యం పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే. అందుకే వారి కవ్వింపులకు మేం స్పందించలేదు. సంయమనం పాటించి, పార్టీకి ఓట్లు పడేట్లు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకూ మనస్ఫూర్తిగా అభినందనలు.

మేం ప్రజల్లోంచి వచ్చిన నాయకులం..
ఎవరినైతే ఎదుర్కోలేం అనుకుంటారో వాళ్లని టార్గెట్‌ చేస్తారు. అది వారి చేతకానితనం. మా కుటుంబంలోనే అన్ని పదవులు అని చంద్రబాబు నా కుటుంబాన్ని టార్గెట్‌ చేసి మాట్లాడాడు. అతను గురివిందె గింజ రీతిలో మాట్లాడితే ఎవరేం చేస్తాం..? మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల కోసం పోరాడి నాయకులుగా ఎదిగాం. కానీ చంద్రబాబు తన మామను వెన్నుపోటు పొడిచి నాయకుడయ్యాడు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొడుకు లోకేశ్‌ నామినేటెడ్‌ పదవి తీసుకుని మంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజాదరణ పొందలేక ఓడిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉండి..సొంత కొడుకును కూడా గెలిపించుకోలేని నాయకుడు చంద్రబాబు. ఆయన బావమరిది కూడా అధికారంలో ఉండగానే ఎమ్మెల్యే అయ్యాడు. చంద్రబాబు వదిన మరో పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మరి చంద్రబాబుది కుటుంబ పాలనా? మాది కుటుంబ పాలనా? ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ఓటింగ్‌ శాతం పెరిగింది. 

అవ్వాతాతలు, మహిళలు.. వైయ‌స్ జగన్‌ని ఆశీర్వదించారు
మాకు అండగా నిలిచావు.. నువ్వు చల్లగా ఉండని ఓటర్లు వైయ‌స్‌ జగన్‌ని ఆశీర్వదించారు. మా నాయకుడు 175 అంటున్నాడేంటి అనుకున్నాను. నిన్నటి ప్రజల స్పందన చూసిన అది నిజమని తేలిపోయింది. 175 స్థానాల్లో గెలుస్తాం. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు వస్తుంది. మార్పు ఉండదు. జరిగిన అలర్లు ఎవరు చేశారో గమనించండి. పల్నాడులో ఎవరు చేశారు? మేం ఒక్క పిలుపు ఇస్తే క్లోజ్‌.. కానీ మేం సంయమనం పాటించాం. మా టార్గెట్‌ దాడులు కాదు.. సామాజిక బాధ్యతగా పేదల ప్రభుత్వాన్ని ఏర్పచడమే. తొందరెందుకు.. అది బలుపో.. వాపో జూన్ 4 తెలుస్తుందిగా?  లేనిపోని హైప్‌ ఇచ్చి బెట్టింగుల కారణంగా కుటుంబాలు దెబ్బతినే చర్యలు చేయవద్దు. సీఎం విదేశాలకు వెళ్లే కార్యక్రమం ముందే అనుకున్నదే. ఎన్నికల వేళ బయటకు చెప్పలేదు. ఈ ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సబంధాలు సఖ్యతతో కూడుకున్నవై ఉండాలి. కేంద్రం రాష్ట్రాలపై కక్షపూరితంగా ఉండటానికి వీళ్లేదు. రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవి చేసి తీరాల్సిందే. అదే తరుణంలో దేశ ప్రయోజనాల అంశాల్లోనూ రాష్ట్రాలు సమర్ధించాలి. ఏదైనా మనక హాని జరిగేది ఉంటే దాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తాం.  అంశాల వారీ సంబంధాలు తప్ప మేం తొత్తులం కాదు. మేం రాష్ట్ర ప్రజానీకానికి జవాబుదారీగా ఉంటాం.  మేం ఎప్పుడూ బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు సబంధించిన అంశాల్లో మాత్రమే మద్దతు పలికాం.

బొత్స ఝాన్సీ ఏం మాట్లాడారంటే..
ప్రశాంతంగా విశాఖలో పోలింగ్‌జరిగినందుకు, అందరూ ఓటు వేయడానికి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ మహిళలు, వృద్ధులు చైతన్యంతో రావడం మహిళా పక్షపాతిగా వైయ‌స్ జగన్‌ సంక్షేమానికే ప్రజలు మద్దుతు పలికారనేది స్పష్టమవుతోంది. మళ్లీ ఫ్యాన్‌ గాలి వీస్తుందనేది నాకు స్పష్టంగా అర్ధం అయ్యింది. వాళ్లలో వైయ‌స్ జగన్‌ని మళ్లీ తీసుకొచ్చికోవాలనే ఆతృత వారిలో కనిపించింది. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కచ్చితంగా జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో కనిపించింది. వారి నమ్మకం ఒమ్ముకాకుండా మేం అమలయ్యేలా పార్టీ నిలబడుతుంది. అత్యధికంగా కష్టపడిని కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. 

Back to Top