చంద్రబాబు మేనిఫెస్టో బోగస్..  

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత  

 తాడేప‌ల్లి: చంద్రబాబు మేనిఫెస్టో బోగస్.. చంద్రబాబును నమ్మే పరిస్థితి ఇక లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత విమ‌ర్శించారు.  ఆయనను నమ్మరు కాబట్టే 2019లో టిడిపిని చెత్తబుట్టలో పడేశారని గుర్తు చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.  2014-19 మధ్య చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం అమలు చేశారని ప్ర‌శ్నించారు.  మళ్ళీ దగా, కుట్రలతో మోసం చేసేందుకు పవన్ కల్యాణ్ ,బిజేపిలతో కలసి చంద్రబాబు ప్రజల ముంగిటకు వచ్చారు.  చంద్రబాబుకు అధికారం అనేది దోచుకోవటానికే తప్ప పాలించడానికి కాదు.  అయినాఇప్పటికీ చంద్రబాబులో మార్పు రాలేదు.  ఓటమి భయంతో జగన్ పై హత్యాయత్నానికి కూడా చంద్రబాబు ఒడిగట్టారు. కూటమి మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్రమోదీ ఫోటో ఎందుకు లేదు?.

బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదు కాబట్టే మేనిఫెస్టో విడుదల సమయంలో బిజేపి నేతలు కనీసం దానిని పట్టుకోలేదు.  పోలవరం ను చంద్రబాబు ఏటిఎం లా వాడుకున్నారని గత ఎన్నికల సందర్బంగా నరేంద్ర మోది స్వయంగా చెప్పారు.ఇప్పుడు బిజేపి నేతలే దానిపై సమాధానం చెప్పాలి. గోదావరిలో ప్రజలు తెలుగుదేశాన్ని,చంద్రబాబును కలిపేస్తారు. విద్యా, వైద్య రంగాల్లో జగన్ గారు తీసుకువచ్చిన సంస్కరణలు వచ్చిన మార్పులు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.  2024 ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు మళ్ళీ సీఎం వైయ‌స్‌ జగన్ ను గెలిపిస్తార‌ని పోతుల సునీత ధీమా వ్య‌క్తం చేశారు.

Back to Top