హామీలు ఆటకెక్కించిన చంద్ర‌బాబును నిల‌దీద్దాం

విస్తృత స్థాయి సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

`బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ప్రకాశం జిల్లా:  ఎన్నిక‌ల హామీల‌న్నీ అట‌కెక్కించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని నిల‌దీద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పిలుపునిచ్చారు. వైయస్ఆర్ సీపీ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసన సభ్యులు బూచేపల్లి శివప్రసాద రెడ్ది అధ్యక్షతన ఇవాళ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించి,  ‘రీకాల్‌ బాబు మేనిఫెస్టో’ కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ..`కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక పెన్షన్ లు కోతలు పెట్టారు..నిరుద్యోగ భృతి 3 వేలు ఏమయ్యాయి. పెన్షన్ అడిగితే... పి4 లో పెట్టాం అంటారు. నిరుద్యోగి భృతి అడిగితే  స్కిల్ డవలెప్మెంట్ లో పెట్టాం అంటాడు..ఇదేమి చోద్యం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలను ప్రజలకు గుర్తు చేసి కార్యక్రమమే... బాబు ష్యూరిటీ....మోసం గ్యారంటీ. పొదిలి వైయ‌స్ జగన్ ప్రోగ్రాంకు అన్ని అనుమతులు తీసుకున్నాం.. కానీ మ‌న పార్టీ కార్యకర్తలు పై అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నాము. పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి చెవిరెడ్డిపై అక్రమ కేసు పెట్టి జైలు కి పంపారు. ఏడాదిలోనే రూ.1 .5 లక్షల కోట్లు అప్పు చేశారు`  అని విమ‌ర్శించారు. కార్య‌క్ర‌మంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్‌ వెంకాయమ్మ , ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రెడ్డి,  మాజీ మంత్రులు సంత‌నూతలపాడు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మేరుగు నాగార్జున, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top