తాడేపల్లి: అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని వ్యాఖ్యానించారు. ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ ను ఆపాలని చూశారు...ఏమైనా ఆపగలిగారా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ చిత్తూరు పర్యటనకు అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వంపై పేర్నినాని మండిపడ్డారు. పేర్ని నాని ఏమన్నారంటే..` ఈ రాష్ట్రంలో రైతాంగానికి వచ్చిన కష్టం దేశంలో ఎక్కడ చూడలేదు 164 సీట్లతో గెలిచానని కూటమి నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు హెలీకాప్టర్లు , ప్రత్యేక విమానాల్లో తమ భార్య పిల్లల వద్దకు తిరుగుతున్నారు కూటమి నేతలు జనం సొమ్ముతో సోకులు చేసుకుంటున్నారు రైతుల కష్టాలు చూసేవాడు కానీ...వినేవాడు కానీ లేకపోవడం మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ధాన్యం రైతుకు గిట్టుబాటు దొరకని పరిస్థితి పెసలు , మినుములు కొనేవాడు లేక ఇబ్బంది పడుతున్నారు మామిడి రైతుల వద్దకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెళతానని చెప్పే వరకూ ఒక్కడు కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చచ్చారా...బ్రతికిలేరా 3.5 లక్షల టన్నులు కొన్నామని అబద్ధాలు చెబుతున్నారు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామని చెబుతున్నారు..ఎవడికిచ్చారు ఒక్క రైతుకైనా ఇచ్చినట్లు చూపించండి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 9న వెళుతుంటే 7న ఢిల్లీ వెళతారా కర్ణాటక కేంద్రమంత్రికి ఉన్న స్పృహ కూడా ఈ రాష్ట్రానికి లేదు జగన్ వెళ్తుంటే మార్కెట్ యార్డు మూసేశారు రైతులను... పంటను కొనే వ్యాపారులను రావొద్దని ఆపేశారు అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ ను ఆపాలని చూశారు...ఏమైనా ఆపగలిగారా నిజంగా మీకు చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చేయండి