విజయవాడ: ‘అధికారం లేకపోయినా వైయస్ఆర్‌సీపీ జెండా మోసిన కార్యకర్తలు దర్జాగా బతుకుతుంటే.. జనసేన జెండా మోసిన కార్యకర్తలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొడుతున్నారు. కాళ్లు పట్టిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావ్ పవన్’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. ఇవాళ వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారు ఈరోజు వేధించే వాళ్ళకి 10 రేట్లు మేము తిరిగి ఇస్తాం నాలుగేళ్లకంటే ముందే...వాళ్ళకి చూపిస్తాం అధికార మదంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు ఎంత కొట్టినా, తిట్టినా వైయస్ఆర్‌సీపీ జెండా మోయకుండా ఎవ్వరు ఆపలేరు అది మా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే..అరెస్టులు చేస్తున్నారు వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భయపడదిలేదు టీడీపీ సోషల్ మీడియాలా డబ్బులకు పని చేసేవాళ్ళు కాదు వైయస్ జగన్ తల్లి, చెల్లెలి గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు తల్లికి, చెల్లికి ఆస్తులు రాసిచ్చారా చంద్రబాబుకి ఎంత మంది చెల్లెలు ఉన్నారో ఎవరికైనా తెలుసా తన చెల్లెళ్లకు చంద్రబాబు ఎంత ఆస్తి రాసిచ్చారు వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చూసి ఎవరు ప్రేమించరు వైయస్ జగన్‌ని ఓ హీరోగా, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రేమిస్తారు సీట్లు చూసుకుని నోరు లేచేది పవన్ కళ్యాణ్ బ్యాచ్ మాకు ఎన్ని సీట్లు, ఉన్నా లేకపోయినా మేం పోరాడుతాం మాకు అధికారం ఉన్నా, లేకపోయినా నోరు లేస్తుంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు నోరు లేపితే తాట తీస్తాడంట నిన్ను నమ్ముకుని నీ జెండాలు మోసిన జనసేన కార్యకర్తల్ని కొడుతుంటే నువ్వేం చేశావ్ పవన్ జనసేన కార్యకర్తల్ని టీడీపీ వాళ్ళు కొడుతుంటే..ఏం చేశావ్? అధికారం లేకపోయినా వైయస్ఆర్‌సీపీ జెండా మోసిన కార్యకర్తలు దమ్ముగా బతుకుతున్నారు పవన్ జెండా మోసిన..వాళ్ళు మాత్రం మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు కొడుతున్నారు..కాళ్ళు పట్టిస్తున్నారు..ఎం చేస్తున్నావ్ పవన్ కళ్యాణ్ మా సంగతి తర్వాత. నిన్ను నమ్మినోళ్ళ సంగతి ముందు చూస్కో మమ్మల్ని ఎంత వేధించినా ..మేము తగ్గేదే లేదు..నీకు చేతనైంది చేస్కో లోకేష్‌కి అమెరికా వెళ్లినా వైఎస్సార్‌సీపీనే గుర్తొస్తుంది ఎన్ని కేసులు పెట్టినా.. వైయస్ఆర్‌సీపీ జెండాని వదిలి పెట్టరు ప్రతి కార్యకర్తకు అండగా వైయస్ జగన్ : దేవినేని అవినాష్ కుటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దు.. ప్రతి కార్యకర్తకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం వలన ఒడిపోయాం. నాలుగు నెలలకే ప్రజలు ఎందుకు కూటమిని గెలిపించామా అని బాధ పడుతున్నారు. చంద్రబాబు ప్రజలకు అబద్దాలు చెప్పి గెలిచారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకోసం పోరాడుదాం. ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు భయపడొద్దు. ప్రతి కార్యకర్తకరు వైఎస్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం : ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అధికారం లేకపోయినా వైఎస్ జగన్ ఆదర్శంగా పార్టీని నడుపుతున్నారు పార్టీని మరింత బలోపేతం చేసేలా జగన్ పనిచేస్తున్నారు ప్రజల్లో నిరంతరం ఉండేలా పార్టీ ఇకమీదట కూడా పనిచేస్తుంది పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేస్తాం రాష్ట్రంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి రెండేళ్లకే ఎన్నికల వాతావరణం వస్తుంది కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి పనిచేస్తాం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం