కొల్లు రవీంద్ర కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు 

మాజీ మంత్రి పేర్ని నాని
 

కృష్ణా జిల్లా: కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని.. ఇంగితజ్ఞానం లేకుండా అబద్ధాలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు.  మచిలీపట్నంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారని, ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక్కరికీ మేలు చేయలేదంటూ దుయ్యబట్టారు.

కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు. నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా?. 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి. నీలాంటి స్థాయిలేనివాడితో.. గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి?. ఏనాడైనా పేదవాడికి మేలు చేశావా?. మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు. మీ కుటుంబం కోసం నేను మాట్లాడను.. నాకు సభ్యత ఉందని పేర్ని నాని పేర్కొన్నారు.

నీకు చేతనైతే పేర్ని కృష్ణమూర్తిలా ఒక్కరోజు బతికి చూపించు. మత్స్యకార గ్రామాలను దగా చేసిన మోసగాడు కొల్లు రవీంద్ర. ఈ డ్రామా కోర్ ఒట్టి మోసగాడు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. మీ తప్పుడు ఆలోచనలు మచిలీపట్నంలో సాగవు. రైతులకు భూ హక్కు కల్పించడానికి యజ్ఞం చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి సీఎం వైయ‌స్ జగన్ అండగా ఉంటారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవు అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.

Back to Top