కృష్ణా జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. వైయస్ జగన్‌ను పోలీసులు, ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకోలేరు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని నాని అన్నారు. ఇవాళ వైయస్ జగన్ కృష్ణా జిల్లాలో మోంథా తుపాన్‌తో నేలకొరిగిన వరి పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నష్ట పరిహారం ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టి.. ఇప్పుడు రైతులకి పరిహారం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న మోసాన్ని రైతులు వైయస్ జగన్ తీసుకువచ్చారు. వైయస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైయస్ జగన్‌పై జనంలో విపరీతమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సభ్యుల్లాగా వైఎస్ జగన్‌ను ఓన్ చేసుకున్నారు. ఆంక్షలు నిర్బంధాల నడుమ పోలీసుల నోటీసులు ఇచ్చి కట్టడి చేసి జగన్ దగ్గరికి జనాలను రాకుండా ఆపలేరు. కృష్ణాజిల్లాలో ఒక్క మంత్రిగాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని.. జిల్లా మంత్రిగాని ఒక్క ఎమ్మెల్యే గాని... రైతులకు జరిగిన నష్టాన్ని పొలంలోకి వచ్చి చూడలేదు. ఎల్లో మీడియాలో రావడానికి పొలంలో ఫోటోలకు పోజులు మాత్రమే ఇస్తారు. రైతు కష్టాన్ని పొలంలోకి వచ్చి విన్నవాడు ఎవరూ లేరు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.