తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన 'వెన్నుపోటు దినం' నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నియోజకవర్గ స్ధాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్య నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భం, ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే కార్యక్రమ. ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై వారి పక్షాన శాంతియుతంగా వైయస్ఆర్ సీపీ ఈ కార్యక్రమం చేపడుతోందని, వైయస్ఆర్‌సీపీ క్యాడర్ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలని ఆయన సూచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం... ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, ప్రజల తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4వ తేదీన అన్నినియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమ ర్యాలీలు, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా జిల్లా కలెక్టర్‌కు, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెమోరాండంను సమర్పించాలి. మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి. ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం అయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ కార్యక్రమం ద్వారా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో వెల్లడయ్యేలా నాయకత్వం పనిచేయాలి. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. ఇందుకు సంబంధించి వైయస్ఆర్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా పాలనా వైఫల్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. నియోజకవర్గ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. మన అధినాయకుడు జగన్ గారు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఇప్పటికే సూచించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలు, అరాచకాలు, జనంలో ఉన్న అసంతృప్తి, వారి మనోభావాలు ఇవన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో ప్రతిబింబించాలి. ఈ కార్యక్రమంపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా ఉంటుంది, అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి రాష్ట్ర నాయకత్వం అందుబాటులో ఉంది. ఇప్పటినుంచి కౌంట్‌డౌన్‌లా తీసుకుని ప్రతిరోజూ ఏర్పాట్లపై సమీక్షించుకోవాలి. ఇందుకు అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని సంసిద్దంగా ఉండాలి, ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రస్ధాయి, జిల్లా, నియోజకవర్గ, మండల స్ధాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలి, మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో పబ్లిసిటీ వచ్చేలా ప్లానింగ్ ఉండాలి, జూన్ 4 జరిగే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి, మనం అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన సమన్వయం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులతో చర్చించిన మీదట ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్ధాయిలో నిర్వహించాలని వైయస్ జగన్ సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా పార్టీ క్యాడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. రాష్ట్రస్ధాయి నుంచి ప్రతి దశలోనూ మానిటరింగ్ జరుగుతుంది కావున ఏ ఒక్కరూ ఆషామాషీగా తీసుకోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.