రెండో దశలోనూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భంజ‌నం

మొద‌లైన‌ పంచాయతీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌
 

అమరావతి : ప‌ంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తొలి ద‌శ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారులు దాదాపు 90 శాతం మంది స‌ర్పంచ్‌లుగా ఎన్నిక అయ్యారు. ఇవాళ రెండో ద‌శ ఎన్నిక‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.  రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 523 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 21 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 1, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు. 

Back to Top