మాట‌ల ప్ర‌భుత్వం కాదు..చేత‌ల ప్ర‌భుత్వం

ఏపీలో నూతన అధ్యాయం మొదలైంది

ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిల‌బెట్టుకుంటారు

వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ అధ్య‌క్షుడు  గౌత‌మ్‌రెడ్డి

 విజయవాడ : వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఉన్న నమ్మకంతో అఖండ విజయాన్ని కట్టబెట్టారని వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ య‌నియ‌న్ అధ్య‌క్షుడు పి.గౌత‌మ్ రెడ్డి అన్నారు బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందని..ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వైయ‌స్ జ‌గ‌న్ నిల‌బెట్టుకున్నార‌ని తెలిపారు.  ఇది మాటల ప్రభుత్వం, ఆర్భాటాల ప్రభుత్వం కాదని, చేతగల ప్రభుత్వమన్నారు.  పేదవాడి గుండె చప్పుడిగా పెన్షన్లు పెంచారని, ఆశావర్కర్లకు రూ.10వేల వేతనం పెంచి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ కార్మిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top