నెల్లూరు: నెల్లూరు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి గూడూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం అందించారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు పరిస్థితులపై సమగ్రంగా పరిశీలన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.