తాడేపల్లి: మనమిత్ర యాప్ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. గత వైయస్ జగన్‌గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థే బాగుందని ప్రజలు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. ఇంటి గడపవద్దే అన్ని ప్రభుత్వ సేవలందించిన వలంటీర్లను తొలగించి, ఆ స్థానంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలపై బలవంతంగా రుద్దాలని కూటమి ప్రభుత్వం చూసింది. అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మనమిత్ర యాప్‌ను ఉపయోగించకపోవడంతో వాట్సాప్ గవర్నెన్స్‌లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా యాప్ రూపొందించకుండా వాట్సాప్ గవర్నెన్స్ ఫెయిలైందన్న కోపాన్ని సచివాలయ ఉద్యోగులపై చూపడం సరి కాదు. దాదాపు 27,280 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి వివరణ కోరే నెపంతో ఇబ్బంది పెట్టడం హేయం. ప్రభుత్వం తన వైఫల్యాలకు సచివాలయ ఉద్యోగులను బాధ్యులను చేస్తోంది. ‘ప్రసాదంలో నత్త వచ్చిందని ఫిర్యాదు చేసిన భక్తులపై కేసు సిగ్గుచేటు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆలయాలకు, భక్తులకూ వర్తింప చేస్తున్నారా?’. :వై.నాగార్జునయాదవ్. – టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ, పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో అనేకచోట్ల వరసగా అపచారాలు జరుగుతున్నాయి. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు.. హిందూ దేవుళ్లను, ఆలయాలను రాజకీయాలకు వేదిక చేసుకోవడం అందుకు ఒక కారణం. భక్తులు అతి పవిత్రంగా భావించి, కళ్లకు అద్దుకుని తీసుకునే ప్రసాదంలో చివరకు నత్త రావడం, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఆలయాల్లో ఒకటైన సింహాచలం ఆలయ పులిహోర ప్రసాదంలో నత్త చూసిన భక్తులు బిత్తరపోయి, ఆలయ అధికారులను ప్రశ్నిస్తే, ప్రసాదం ప్యాకెట్ లాక్కుని దిక్కున్న చోట చెప్పుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీనిపై ఆగ్రహించిన భక్తులు, అధికారుల తీరుపై నేరుగా వీడియో రిలీజ్ చేసి ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఫిర్యాదు చేసిన భక్తులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వేధిస్తోంది. అలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని హిందూ దేవుళ్లపై, ఆలయాలకు వచ్చే భక్తులపైన కూడా అమలు చేసి వేధిస్తున్నారు.