సీఎం వైయ‌స్ జగన్‌ గారికి నా సెల్యూట్

 సినీ నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి

అన‌కాప‌ల్లి: తాండవ ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేసి ముందుకు వెళుతున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ గారికి నా సెల్యూట్ అని సినీ నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రికి వందనాలు. ధ్యాంక్యూ అన్నారు.   అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం జోగినాథునిపాలెంలో నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల, తాండవ– ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో నారాయ‌ణ‌మూర్తి మాట్లాడారు.
మిత్రులారా మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను, మనమంతా కూడా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలో ఉన్న మెట్ట ప్రాంత వాసులం, అలాంటి మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన కాళ్ళ కింద ఏలేరు నీళ్ళు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీరు లేదు, సాగు భూమి లేదు, వ్యవసాయం లేదు. అలో లక్ష్మణా అని రైతులు వలసపోతున్నారు, అలాంటి సమయంలో తాండవ ప్రాజెక్ట్‌ గురించి నేను, దాడిశెట్టి రాజా , శంకర్  , ఎమ్మెల్యేలందరూ కలిసి సీఎంగారికి విజ్ఞప్తి చేశాం, ఒకే ఒక మాట ఇప్పటివరకూ మనల్ని ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు తాండవ ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేసి ముందుకు వెళుతున్న సీఎం జగన్‌ గారికి నా సెల్యూట్, వందనాలు. ధ్యాంక్యూ.    


మళ్ళీ మన జగన్‌ మామయ్యే అధికారంలోకి రావాలి:  సీహెచ్‌. రేష్మ, బైపీసీ సెకండియర్‌ విద్యార్ధిని 

గుడ్‌ మార్నింగ్, యంగ్, డైనమిక్‌ సీఎం, ఐదు కోట్ల ఏపీ ప్రజల గుండె చప్పుడు మన సీఎంగారు. అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా మారింది, ధ్యాంక్యూ సీఎం సార్, ఇక్కడ ప్రతి ఇంటిలో నవరత్నాల పథకాల వల్ల లబ్ధి జరుగుతుంది. నేను డాక్టర్‌ కావాలన్నది కలగా ఉంది, డాక్టర్‌ వృత్తి అనేది ప్రజల ప్రాణాలు కాపాడుతుంది. అయితే డాక్టర్‌ అయి పేదలకు సేవ చేయాలని ఉంటుంది. కానీ మాలాంటి ఏజెన్సీ ప్రాంతాల విద్యార్ధులకు, గ్రామీణ విద్యార్ధులకు తీరని కలగా ఉంది. కానీ మీరు ఇక్కడ మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం చేపట్టడంతో మా కల నెరవేరబోతుంది. విద్య అనేది ఒక శక్తివంతమైన ఆయుధం, ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే ఉంది. జగనన్న అమ్మ ఒడి అద్భుతమైన పథకం, మాలాంటి విద్యార్ధులకు ఇది వరం, విద్యాదీవెన, విద్యాకానుక, వసతిదీవెన, నాడు నేడు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు మా విద్యార్ధుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్నాయి. సామాజిక న్యాయం జరిగినప్పుడే విద్య, సమాన అవకాశాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని బలంగా నమ్మిన వ్యక్తి మన సీఎం గారు, ధ్యాంక్యూ సోమచ్‌ జగన్‌ మామయ్యా, మళ్ళీ మన జగన్‌ మామయ్యే అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ.

Back to Top