కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించాం

అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి
 

 తాడేపల్లి:  కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించామని అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరరెడ్డి తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్పారు. అధికారం కోల్పోయాకే చంద్రబాబుకు రైతులు గుర్తొస్తారని మండిపడ్డారు. మద్దతు ధర ప్రకటించే ది, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వమే కదా అన్నారు. కూలీల రేట్లు, ధరలు పెరుగుతుండటంతో వ్యవసాయంపై రైతుకు ఆదాయం తగ్గుతుందన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని మనం నిలదీయాల్సి ఉందన్నారు. కేంద్రాన్ని ఏమీ అనకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై వ విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతులకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు కల్పిస్తున్నామని ఎంవీఎస్‌ నాగిరెడ్డి వివరించారు. ప్రతిపక్షం బాధ్యతగా నడవాల్సింది పోయి భాష కూడా హీనంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ అధికార ంలోకి వచ్చాకే వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయని ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. 

‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం నాశనం అయిందట.. చంద్రబాబు ఉన్నపుడు బాగుందట. కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా?. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించారా?. చంద్రబాబు పెట్టిన బకాయిలు కూడా చెల్లించింది సీఎం వైఎస్‌ జగన్‌.

76 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటికే అందించాం. ఎఫ్‌సీఐ నుంచి రూ.300 కోట్లకు పైగా రావాలి. పవన్ కల్యాణ్‌ ఎవరిని ప్రశ్నించాలి.? ఆ డబ్బు ఇప్పించాలని బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు..?. కోనసీమలో ధాన్యం డబ్బు ప్రతి రైతుకు అందాయి. కోనసీమకు ఈ పని చేశానని చంద్రబాబు ధైర్యం చెప్పాలి. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే.. మేము వచ్చాక కరువు మండలాలే లేవు. రైతులకు పంటల బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ విషయంలో టీడీపీ చేసిందేమిటి...? చంద్రబాబు 11 శాతం మేర వ్యవసాయ బడ్జెట్ పెడితే.. మేము మొన్నటి బడ్జెట్లో 16 శాతం పెట్టాం. నేను వెళ్లడం వల్లే రైతులకు ధాన్యం డబ్బులు వచ్చాయ్ అని పవన్ అంటున్నాడు. ఆయన వెళ్లడం వల్లనే రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు వచ్చాయా..?. కోనసీమ గొడవలు జరిగాక ఇప్పుడు మళ్లీ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని’’ నాగిరెడ్డి నిప్పులు చెరిగారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top