లిప్ట్ ఇరిగేష‌న్ ప‌నుల‌కు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి భూమిపూజ‌ 

వైయ‌స్ఆర్ జిల్లా: బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలంలోని తెలుగు గంగ కాలువ నుంచి తడుకువాగు చెరువు, మేలకుంట తదితర చెరువులకు నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు రూపొందించిన‌ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు వైయ‌స్ఆర్ జిల్లా ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి భూమిపూజ చేశారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వైయ‌స్ అవినాష్‌రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేసి ప‌నులు ప్రారంభించారు. అనంతరం కాశీనాయన మండలంలోని గంగనపల్లి  నుంచి వరికుంట్ల చెరువుకు  లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్య‌క్ర‌మంలో బద్వేల్ ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డిసి  గోవిందరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు,  నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top