శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లు నిద్రపోతున్నారా!  

దళితుల‌పై టీడీపీ దాడుల‌పై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫైర్‌

విశాఖ‌: శ్రీ‌కాకుళం జిల్లాలో దళితుల పైన టిడిపి నాయకులు దాడి చేస్తుంటే జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ నిద్ర‌పోతున్నారా అని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి  నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం కిష్టపురం గ్రామం   ఎస్సీ కులానికి సంబంధించిన చల్ల అప్పలరాజు తన భార్య చల్ల దమయంతి  మీద ఆదివారం అనగా (27-10-2024) ఉదయం  టీడీపీ గుండాలు ధర్మాన శ్రీను, ధర్మాన ప్రసాద్ ,తంగి షణ్ముఖ పల్లి వైకుంఠరావు,  పగోటి సీమలు ,పగోటి అప్పారావు, సుమారు 70 మంది ఇంటి పైకి వచ్చి దాడిచేసి తన భార్య అయినా చల్ల దామయంతిని రాడ్డుతో తల పగలగొట్టి కులం పేరు పెట్టి దూషించారు. ఊరు నుంచి వెలి వేస్తాము. అని చెప్పి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించారు. ఇదంతా చల్లా అప్పలరాజు అనే వ్యక్తి వైయ‌స్ఆర్‌సీపీ  యాక్టివ్ పర్సన్ కాబట్టి ఇలా కక్షపూరితంగా దాడి చేశార‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో రెండు వీడియోలు పోస్టు చేశారు.

https://x.com/VSReddy_MP/status/1850566779397185666

Back to Top