శ్రీకాళహస్తిలో పవిత్రారెడ్డిపై దురుసు ప్రవర్తన 

తిరుప‌తి:  శ్రీ భవానీ దీక్షలో ఉన్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డిపై టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ బోర్డు సభ్యుడు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్‌ అసభ్యంగా ప్రవర్తించి, దూషించారు. మహిళ అని కూడా చూడకుండా ఉమ్మి వేసి, తీవ్ర అభ్యంతరకరమైన పదజాలంతో దూషించ‌డం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

Back to Top