ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ గృహ నిర్బంధం

 ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీకి వెళ్లకుండా అడ్డంకులు

 ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొటికలపూడి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పాలడుగు జ్యోత్స్న నామినేషన్‌ ర్యాలీకి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. జోగి రమేష్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల ప్రక్రియలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించే హక్కును అడ్డుకోవడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. 

Back to Top