వెల్దుర్తి మండలం అల్లుగుండులో వైయ‌స్ఆర్‌సీపీ నేతపై దాడి

  శ్రీరామరెడ్డిపై దాడి చేసిన టీడీపీ శ్రేణులు.. తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలింపు

 కర్నూలు జిల్లా: వెల్దుర్తి మండలం అల్లుగుండులో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ నేత శ్రీరామరెడ్డిపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

గాయపడిన శ్రీరామరెడ్డిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.  

Back to Top