ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుంది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. వారిపై అధికార పార్టీ సానుభూతిపరులనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుందన్నారు. వీటిని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అఖరున ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని చంద్రబాబు శోకాలు పెడతారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

Back to Top