విశాఖ: వాలంటీర్ వ్యవస్థలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ. అలాంటి అనుసంధానకర్తలపై పడి ఏడవడం మానుకోవాలి. తిరుపతి ఉపఎన్నికల్లో ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా? లేదా ఓడిపోయాక ఆ నిందను వాలంటీర్లపై మోపాలని ఫిక్సయ్యారా? అంటూ ట్వీట్ చేశారు. పచ్చకుల బ్యాచ్ కు తానే లీక్ చేస్తాడు. మళ్లీ ఏదో జాతీయ సమస్య అన్నట్లు సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్. పోలీసులైతే మళ్లీ తననే ఇరికిస్తారట! ఇంటర్ పోల్, స్కాట్ లాండ్ యార్డ్ దర్యాప్తు కోరాల్సింది నిమ్మగడ్డా. నీ చెత్త లేఖలు, సీక్రెట్ మీటింగ్ లపై చైనా హ్యాకర్ల కన్నుపడిందేమో అంటూ అంతకుముందు చేసిన ట్వీట్‌లో విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.