ఏమి నాటకాలయ్యా చంద్రం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి  
 

విశాఖ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించి మాక్ అసెంబ్లీ నిర్వ‌హించుకుంటోన్న టీడీపీ నేత‌ల‌కు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ  విజ‌యసాయిరెడ్డి చుర‌క‌లంటించారు. 

'ఏమి నాటకాలయ్యా చంద్రం! అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ - మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగు డ్రామా పార్టీ జ‌బ‌ర్ద‌స్త్ షో అంటూ ఓ ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు.

కాగా, అసెంబ్లీలో ప్ర‌భుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మాట నిల‌బెట్టుకుంద‌ని విజ‌యసాయిరెడ్డి అన్నారు. 'హామీ ఇస్తే నిలబెట్టుకోవడం సీఎం వైయ‌స్ జగన్ గారి సహజ గుణం - సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు...అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది' అని విజ‌యసాయిరెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top