ఆ గాంధేయవాది సేవలను స్మరించుకుంటూ ముందుకు సాగుదాం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి: భూదానోద్యమ పితామహుడు, సమ సమాజ స్వాప్నికుడు ,  స్వ‌తంత్ర్య‌ సమర యోధుడు వినోబా భావే వర్థంతి నేడు. సమాజానికి ప్రతి వ్యక్తి ఎంతో కొంత తిరిగివ్వాలని నేర్పిన మహానీయుడాయన.
ఆ గాంధేయవాది సేవలను స్మరించుకుంటూ ముందుకు సాగుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  ఆయన సేవలకుగాను భారతరత్న, రామన్ మెగసెసే అవార్డులు వరించాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆ బాబుల‌కు ఛాన్స్ లేకుండా చేశారు

ఇసుక గురించి అవాకులు చెవాకులు పేలే బాబులకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు సిఎం @ysjagan గారు. ఎవరెవరు ఉచితంగా తీసుకెళ్లొచ్చో ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిన్నర క్రితం దాకా ఇసుక మాఫియా రాజ్యమేలిన రీచ్ లలో ఇప్పుడు యంత్రాల శబ్దం తప్ప ఇసుక దొంగల నీడలు కూడా కనిపించడం లేద‌ని మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top