విశాఖలో వెయ్యి పార్కులను, 216 చెరువులను అభివృద్ధి చేస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు సుపరిపాలన అందిస్తున్నారు. అదే స్ఫూర్తితో జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. విశాఖలో వెయ్యి పార్కులను, 216 చెరువులను అభివృద్ధి చేస్తాం. 794 మురికివాడలను అభివృద్ధి చేసి ఇళ్ల పట్టాలు ఇస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, కశింకోట మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబును పరామర్శించడం జరిగింది. దాడికి సంబంధించిన వివరాలను బాధితుడు, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగిందంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top