ఆత్మకూరులో బరితెగించిన పచ్చమూకలు 

 నంద్యాల జిల్లా: ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఆత్మకూరు పట్టణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై పచ్చ మూకలు దాడికి యత్నించాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అరాచకాలను వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై చొచ్చుకొచ్చిన టీడీపీ గూండాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు. 
పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ పోరు బాట పట్టిన సంగతి తెలిసిందే.  గురువారం  జరగబోయే కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు.

Back to Top