పరాజయం మూటగట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయో?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయోన‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. తిరుపతి వైస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి  కులంపై అనుమానాలు వ్యక్తం చేసారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేసారు. రెండేళ్లు గడిచినా సిఎం వైయ‌స్ జగన్ గారిపై ప్రజల విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదని గురుమూర్తి గారి మెజారిటీ స్పష్టం చేసింది. పరాజయం మూటగట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయోన‌ని ట్వీట్ చేశారు.

ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా..
లోకేశ్  ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు. అగౌరవంగా  "వాడు సరిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది" అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని టెన్షన్ పడుతున్నట్టుంది. పార్టీ ఉండదూ, బొక్కా ఉండదని ఉన్నమాటే అన్నావ్. ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా అంటూ మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top