గ‌డ‌ప గ‌డ‌ప‌కూ త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాలి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

ప్ర‌తి ఇంటికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాసిన లేఖ అందించాలి

మ‌న ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు వివ‌రిస్తూ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి

ప్ర‌తి ఇంటి నుంచి మిస్‌డ్ కాల్ ఇప్పించాలి
 
ప్ర‌తి గ్రామ స‌చివాల‌య ప‌రిధిలో బూత్ క‌మిటీలు ఏర్పాటు చేయండి

అమ‌రావ‌తి:  గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప్ర‌తి ఇంటికి వెళ్లాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సూచించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఆదేశాల‌తో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మంపై శాస‌నస‌భ్యులు, నియోజ‌క‌వ‌ర్గ‌ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులకు మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సోమ‌వారం అసెంబ్లీ క‌మిటీ హాల్లో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం ఎలా నిర్వ‌హించాలి. ప్ర‌తి ఇంటికి వెళ్లిన స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలి అన్న అంశాల‌పై స‌భ్యుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు.   

విజ‌య‌సాయిరెడ్డి ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ట్రైనింగ్‌ కార్యక్రమం నిర్వహించాం. వర్క్‌షాప్‌లో ఇటీవల సీఎం వైయస్‌ జగన్‌ గడపగడపకు మన ప్రభుత్వంపై దిశా నిర్దేశం చేశారు.  సీఎం ఆదేశాల మేరకు నెలలో 20 రోజులు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లాలి. నెలలో రోజుల్లో 20 రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తే.. పది సచివాలయాలను సందర్శించవచ్చు. 

మే 11వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏ కార్యక్రమంలోనై ఒడిదుడుకులు ఉంటాయి. జూన్‌ మాసం నుంచి చాలా సీరియస్‌గా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఎమ్మెల్యే కృషి చేయాలి. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎన్ని గ్రామాల్లో పర్యటించారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా నెలకు 10 సచివాలయాలను సందర్శిస్తే  నియోజ‌క‌వ‌ర్గం పూర్తి చేసేందుకు 8 నెలల స‌మ‌యం ప‌డుతుంది.  

మ‌న‌ ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు. ఎంత వరకు చేశారన్నది మీ అనుభవాలను పంచుకోవాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ఏ  ఒక్కరి ఇంటిని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని ఇళ్లను కవర్‌ చేయాలి. ఒక్కో ఇంట్లో ఎంత సమయం కేటాయిస్తున్నార‌న్ని ఇంపార్టెంట్‌. 

మీకు మూడు బుక్‌ లెట్‌ ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ లబ్ధిదారులకు రాసిన లేఖ, మేనిఫెస్టో బుక్‌లెట్, ఈ మూడేళ్లలో ఏ పథకాలు అమలు చేశామన్నది ఈ బుక్‌లెట్‌లో పొందుపరిచాం. ఎంత టైం కేటాయిస్తున్నారని ముఖ్యమైన అంశం.
మే 11 నుంచి ఈ రోజు వరకు ఎన్ని గ్రామ సచివాలయాలను కవర్‌ చేశామన్నది గమనించాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు దాదాపు ఏడాది పడుతుంది. కాబట్టి సమయం చాలా విలువైనది. త్వరగా ప్రతి ఇంటిని సందర్శించాలి. కొందరు ఒక్క రోజులోనే ఒక సచివాలయాన్ని కవర్‌ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ప్రతి లబ్ధిదారుడిని కన్వీన్స్‌ చేసి వారితో పార్టీకేంద్ర కార్యాలయానికి మిస్స్‌డ్‌ కాల్‌ చేయించాలి. అప్పుడే అతన్ని సభ్యుడిగా పరిగణిస్తాం. మిస్‌డ్‌ కాల్‌ తప్పనిసరిగా ఇప్పించాలి. 

కొన్ని కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు వాలంటీర్ల ద్వారా ఇళ్లకు బుక్‌లెట్లు పంపిస్తున్నారట. అలాంటివి జరగకూడదు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో ఎక్కువ సమయం కేటాయించాలి. మూడు బ్రోచర్స్‌ లబ్ధిదారులకు అందజేయాలి. ప్రతి ఇంట్లో అందరూ కూడా మనకు అనుకూలంగా ఉంటారని అనుకోకూడదు. న్యూట్రల్‌ ఓటర్లను మనవైపు ఆకర్శించేలా వారిని ఒప్పించి మిస్‌డ్‌ కాల్‌  ఇప్పించాలి. గ్రామ సచివాలయం పరిధిలో బూత్‌ కమిటీలను ఎమ్మెల్యే ఎంపిక చేయాలి. అప్పుడే ఓటర్లను బూత్‌ కమిటీలు బూత్‌ వద్దకు తీసుకువస్తారు. ఎవరు మనకు పూర్తి నమ్మకంగా, నిష్పక్షపాతంగా ఉంటారో గమనించి బూత్‌ కమిటీలో ఎంపిక చేయాలి. గ్రామ కమిటీలకు, బూత్‌ కమిటీలను సమన్వయం చేయాలి. మండల కమిటీలు, గ్రామ కమిటీలు ముందుగానే నియమించాలి. ఎన్నికల్లో బూత్‌ కమిటీల పాత్ర కీలకమని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.


 

ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు వార‌ధిలా ఉండాలి:  లేళ్ల అప్పిరెడ్డి

ప్ర‌తి ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు వార‌ధిలా వ్య‌వ‌హ‌రించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సూచించారు. ట్రైనింగ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ..గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో లోపాలు సరిదిద్దేలా ఇటీవ‌ల‌ సీఎం వైయస్‌ జగన్  దిశానిర్దేశం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వంపై మరింత సమాచారం తెలిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు వివరించేందుకు గడప గడపకు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజలకు వారధిలా ఉండాలి. క్షేత్రస్థాయిలోకివెళ్లిన సమయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలో అన్న అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను నోట్‌ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దేశంలో ఏ సీఎం అమలు చేయనివిధంగా మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశారు. ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతిఎమ్మెల్యే తన పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లాలి. మనం వెళ్లినప్పుడు రకరకాలప్రశ్నలు వేస్తుంటారు. అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. పార్టీ పెద్దలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు తిరుగుతున్నారన్నది విజయసాయిరెడ్డి సమీక్షిస్తున్నారు. పార్టీకేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎమ్మెల్యేలు వారధిలా ఉండాలి. ఏ సీఎం కూడా ఆలోచన చేయని విధంగా ప్రతి ఇంటికి వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. మీ అందరి సహకారం ప్రభుత్వానికి కావాలి. మీ అందరూ కూడా క్రియాశీలంగా ఉండాలి. మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా 175 నియోజకవర్గాల్లో మనం విజయం సాధించాలి. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అప్పిరెడ్డి సూచించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top