పార్టీ విజయం కోసం పని చెయ్యండి..

పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి..

తాడేపల్లి: పార్టీలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయాలని పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జ్  వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.. తాడేపల్లిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం  పార్టీ సేవాదళ్,ఐటి విభాగాల జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ
ఎమ్మెల్యేలు,నియోజవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ సేవాదళ్,ఐటి విభాగాల జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. జగన్ గారితో పాటు పాదయాత్రలో కలిసి నడిచిన వారికి, ప్రతిపక్షంలో సేవా దళ్ విభాగంలో పనిచేసిన వారికి ప్రభుత్వం వచ్చాక తగిన గుర్తింపు లభించిందన్నారు. అలాగే
2019లో పార్టీ విజయం కోసం పని చేసిన వారికి జగన్ గారు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. భవిష్యత్తులో నాయకులుగా ఎదిగేందుకు పార్టీ మీకు మరిన్ని అవకాశాలు ఇస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని పిలుపునచ్చారు. అనుబంధ విభాగాల జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలు పూర్తయిన తర్వాత  అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కానున్నారని తెలిపారు.. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని వారికి వివరించారు..రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిలో పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం  జరిగినా అందులో సేవాదళ్ భాగస్వామ్యం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారని చెప్పారు.
పార్టీ అనుబంధ విభాగాలు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా పార్టీ కేంద్ర కార్యాలయం మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ పార్టీ నిర్మిస్తున్న జిల్లా కార్యాలయాల్లో అనుబంధ విభాగాలకు అన్ని  సదుపాయాలు కల్పిస్తామని వారికి వివరించారు..

ఈ సమావేశాలలో మీరు ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పార్టీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని, పార్టీ నుండి పూర్తి సహకారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని వారికి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.వైఎస్ఆర్ సేవాదళ్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో ఆ విభాగ సమావేశం జరగగా,పార్టీ ఐటీ విభాగ అధ్యక్షుడు సునీల్ పోసింరెడ్డి నేతృత్వంలో ఐటి విభాగ సమావేశం జరిగింది.ఈ సమావేశాలలో పార్టీ కార్యాలయ ఇంచార్జీ ,ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top