ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని వైయస్‌ఆర్ సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాల ద్వారా దేశంలోని మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిందని అభిప్రాయపడ్డారు. మైనార్టీలకు వైయస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఎన్‌పీఆర్‌లో అడుగుతున్న సమాచారం గతం కంటే భిన్నంగా ఉందని, ఈ అంశాల అన్నింటిపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చ జరగాలన్నారు. జాతీయ బడ్జెట్‌పై అఖిలపక్ష సమావేశానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీలకు తమ పార్టీ వ్యతిరేకమని ఈ భేటీలో తెలిపినట్లు వెల్లడించారు.