తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వల వేస్తే పడలేదు. ఇప్పుడు సోనూ సూద్ కు గాలం వేశాడు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియక పోదు. ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎక్కువ కరోనా పరీక్షలు చేయడంతోపాటు వేగంగా ఫలితాలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 చోట్ల ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 14 వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయని మరో ట్విట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.