‘తర్వాత దేని గురించి ఎగిరిపడతారో..’

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని గురించి ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటున్నాడో ప్రజలకు బాగా అర్థమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ‘రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గాయనేదే ఆయన ప్రధాన బాధ. ల్యాండ్‌ మాఫియా కోసమే రాజధాని పర్యటన. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు. ప్రజల కోసం ఏనాడూ పనిచేసింది లేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. 
‘ఇ’సుక, ‘ఇం’గ్లీష్‌ మీడియం రికార్డులు అరిగిపోయాక ఇప్పుడు ‘ఉ’ల్లిపాయల మీద పడ్డారు. ఇది ఒక్క మన రాష్ట్ర సమస్యే కాదు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక సమస్య కావాలిగదా. రైతు బజార్లలో కిలో రూ.25కు అందజేస్తున్న సంగతి మాట్లాడరు. ఇ,ఇ,ఉ తర్వాత తర్వాత దేని గురించి ఎగిరి పడతారో అంటూ ట్వీట్‌ చేశారు. 
 

Read Also: ఆశ చూపించి వంచించడం చంద్రబాబు టెక్నిక్‌

తాజా ఫోటోలు

Back to Top