

















పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం
విజయవాడ: తనను పోలీసులు తప్పుడు కేసులో అరెస్టు చేశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఒక్క సారి కూడా విచారణకు పిలవలేదని స్పష్టం చేశారు. నిన్నటి వరకు తన మీద ఎఫ్ ఐ ఆర్ కూడా లేదని తెలిపారు. నిన్న బెంగళూరులో లుక్ ఔట్ నోటీస్ అక్రమంగా ఇచ్చారని తప్పుపట్టారు. విచారణకు తాను సహకరిస్తానని ఆయన వెల్లడించారు. నిన్నటి వరకు నా మీద ఒక్క కేసు కూడా లేదని, అయిన తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈరోజు కూడా విచారణ లో నా అభిప్రాయాన్ని తీసుకోలేదని ఆక్షేపించారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.