చంద్రబాబు జేబు సంస్థలా రాష్ట్ర ఎన్నికల కమిషన్

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి  

గుంటూరు: పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నిక ప్రక్రియ చూశాక రాష్ట్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు జేబులో సంస్థలా పని చేస్తుంద‌ని స్పష్టమ‌వుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మండిప‌డ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక తీరుపై మోదుగుల స్పందించారు. ` రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబు కనుసన్నల్లో పని చేసింది. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడనే భావన ప్రజల్లో ఉంది. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులను చట్టం ముందు నిలబెడతాం. ప్రజాస్వామ్య దేశంగా కొలవబడుతున్న భారతదేశంలో చంద్రబాబు లాంటి ఓట్ల దొంగ ఉండడం బాధాకరం. 
బెదిరించి, దాడులు చేపించి ఓట్లు వేయించుకొని గెలవడం కూడా ఒక గెలుపేనా? వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. తప్పకుండా తిరిగి పాఠాలు చెబుతాం` అని వేణుగోపాల్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top